తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో, గుర్తును తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు. ట్విట్టర్ వేదికగా.. ‘పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి? తాము పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు ఆలస్యంగా అందించే సంస్కృతికి ముగింపు పలికాం. ఆరునెలలు ముందు నుంచే ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లి పుస్తకాలు,యూనిఫారాలను విద్యార్థులకు పాఠ్య అందించే ప్రయత్నం…
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో విలీనమైన ఐదు టీఎస్ గ్రామాల భవితవ్యంపై వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కోరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఎన్ఎస్ కెనాల్ కాలనీ…
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కార్ నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు యువకులు. కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా… ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన Xylo కార్ లో చార్మినార్ కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో…
సీఎం రేవంత్ ఆదేశాలననుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్టాస్క్ఫోర్స్ ఓ హోటల్లో భారీ వ్యభిచార ముఠాను ఛేదించి ముగ్గురు నిర్వాహకులను పట్టుకుంది. ఘటనా స్థలం నుంచి ఆరుగురు బాధితులను రక్షించారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ బృందం హోటల్‌పై దాడి చేసి సూర్యకుమారి అలియాస్ రాణి (38), కె విజయ శేఖర్ రెడ్డి (49), అర్కోకిత్ ముఖర్జీ (30)లను పట్టుకోగా, వారి సహచరులు మరో ఇద్దరు తప్పించుకోగలిగారు. “రాణి తన సహచరుల సహాయంతో త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి మహిళలను…
హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ సిబ్బంది నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. రాయ్ , బండి సంజయ్ కూడా కౌగిలించుకున్నారు. ఈ కార్యక్రమానికి హంపి మఠం శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ,…
ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీ లతో భేటీ కానున్నారు. ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈనెల 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈనెల 22న ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ పై…
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు ఉన్నా చాలా మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం రాయికోడ్‌లో జరిగిన “బడి బాట” ఆవిష్కరణ కార్యక్రమంలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ గ్రామాల నుంచి పాఠశాల బస్సుల్లో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాలని చాలా మంది కలలు కంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇది చిన్న నిజం.…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగిందని తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి…
అత్యంత నిరాడంబరంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు బండి సంజయ్ కుమార్. రేపు ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి…