మేడ్చల్‌లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును మేడ్చల్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. జగదాంబ జ్యువెలరీ షాప్‌లో మాస్క్, బుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహతి మీడియా మాట్లాడుతూ.. మేడ్చల్ లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును ఛేదించామని తెలిపారు. 24 గంటల్లో…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ 500 నుంచి 1000 ఎకరాల్లో విస్తరించి దానికి అనుగుణంగా భూమిని సేకరించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీపడి ఈ హబ్‌లో అన్ని వ్యాధులకు నాణ్యమైన చికిత్స అందించాలనే ఆలోచన ఉంది. హబ్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి శనివారం ఇక్కడ తెలిపారు.…
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిన కాపు సామాజికవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వానకాలం విడత వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు. తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రుతుపవనాలకు ముందు వర్షాలు కురిసి ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ రైతు భరోసా అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయలేదన్నారు . యాసంగి పంటలకు ఎకరాకు…
రేషన్ కార్డ్ ఏ కాదు ఏదైనా అనర్హులైన వారు వారి అంతట వారే తప్పుకుంటే మంచిదన్నారు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ధనుకులకి కాదు బీదవారి ప్రభుత్వమని, ప్రజలకి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎవరైనా అధికారులు ఎక్కువ చేస్తే నా పాలనలో ట్రాన్స్ఫర్లు ఉండవు డైరెక్ట్‌గా రిమూవ్ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.…
నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజర్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు…
ఐటీఐఆర్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రద్దు చేసిన ఐటీఐఆర్ ని తెప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి.. సంజయ్ లదే అని జగ్గారెడ్డి అన్నారు. రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండని, చేరికల అంశం సీఎం పరిధిలోనిదన్నారు. నా పరిధికి మించి స్పందించను..రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పన్నారు. ఐటీఐఆర్ upa ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందని, తెలంగాణ…
రైస్ మిల్లింగ్ పరిశ్రమలో దేశంలోనే నంబర్ వన్ రైస్ మిల్లింగ్ పరిశ్రమగా ఎదగాలంటే అత్యాధునిక సాంకేతికత, యంత్రాలను అందిపుచ్చుకోవాలని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 16వ అంతర్జాతీయ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో 2024ను ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రైస్ మిల్లింగ్ మరియు నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చడానికి రైస్ మిల్లర్లకు…
తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8నెలల్లోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో.. 2 లక్షల రూపాయల వరకు రుణామాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం దండగ కాదు..…
కరీంనగర్ జిల్లాలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఆనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్ట పడి పని చేయడం వల్లె తనకు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రచారం ప్రారంభించానని, తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు. అందుకోసం మళ్ళీ ఈ దేవస్థానంలో స్వామి వారి…
రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9 2023లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధరపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు విధివిధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్న దానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ప్రభుత్వ…