తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో ప్రారంభమైంది. వ్యవసాయం, రైతు సంక్షేమం ఎజెండాగా కేబినెట్లో ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. రుణమాఫీపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిట్లు సమాచారం. రుణమాఫీ విధివిధానాలు, అందుకు అవసరమైన రూ.39 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవడంపై కేబినెట్లో చర్చించారు. ఈ ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం…
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని బొగ్గు గనుల పై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు,నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయటం ద్వారా బొగ్గు ప్రాజెక్టులను బడా ప్రవేట్ సంస్థలకు అప్పగించి ప్రభుత్వ బొగ్గు రంగ సంస్థలను నిర్విర్యం చేయటమే కాక కార్మికుల హక్కులను ఉపాధి అవకాశాలను లేకుండా చేయటం జరుగుతుందని,కేంద్ర బొగ్గు గనుల…
కిషన్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, సింగరేణి ఇబ్బందులకు కారకులు ఎవరు… ఇప్పుడు చర్చ జరుగుతుందన్నారు బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయంలో నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించారని ఆయన తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ లతో ప్రైవేట్ సంస్థలు వేల కోట్లు అప్పులు తీసుకున్నాయని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి అప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, గత రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని మరోసారి తేలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడేది కెసిఅర్ అని నిరూపితం అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులు దారాదత్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ పట్ల సోయి లేదని, కేఆర్ఎంబీ విషయాల్లో కాంగ్రెస్ ఎదురు దాడి చేసి… తప్పించుకునే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు కాంగ్రెస్…
రాజన్న సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సంఘం కళ్యాణ మండపంలో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గంకు ఎన్నికైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహకార రంగంలో బ్యాంక్ లో అంతో విలక్షణమైనదని, 47 బ్యాంక్‌లో అర్బన్ బ్యాంక్ ప్రత్యేకమైందన్నారు. అందరూ తప్పకుండా పాత బకాయిలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంక్…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలు, సేవలను బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చివరి దశకు మార్గనిర్దేశం చేసే శక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ…
కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్న… వారి పోరాటాల, త్యాగాల ఫలితం ఈ గెలుపు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మూడో సారి మోడీ నీ ప్రధాని గా చూడాలని 8 మందిని గెలిపించారు…. తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయం లో ప్రారంభించిన కార్యకర్తలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులు అయ్యారు… వారికి మంత్రి వర్గం లో తీసుకున్నందుకు మోడీ కి…
వేగంగా పట్టణీకరణ, కూరగాయల సాగుకు అవసరమైన విస్తీర్ణం అందుబాటులో లేకపోవడం, పెరుగుతున్న కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యానవన శాఖ జూన్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రెడ్‌హిల్స్‌లోని తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘మన ఇల్లు మన కురగాయలు’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం డాబాపై నాణ్యమైన, పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలను పండించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించడం , కర్బన ఉద్గారాలను…
జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో…
16 ఎంపీలు సాధించిన టీడీపీ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో చేరి 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ , బీజేపీ గెలిచిందని, సింగరేణి బొగ్గు గనులను బహిరంగ మార్కెట్లో రేపు కేంద్రం వేలం వేయబోతుందన్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో సింగరేణి బొగ్గు గనుల వేలం ఆపాలని అప్పటి…