DCP Giridhar : హైదరాబాదులో డెకాయ్ ఆపరేషన్… యాంటీ డెకాయిట్ టీమ్స్ రంగంలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో జరుగుతున్న వివిధ రకాల దొంగతనాలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగానే నిన్న అర్ధ రాత్రి సికింద్రబాద్ లోని మెట్టుగూడ లో డెకాయ్ ఆపరేషన్ చేసి రోడ్డు పక్కన నిద్రించే వారినే టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లు దొంగిలించే ముఠాను అరెస్ట్ చేశారు.. ఈ డెకాయ్ ఆపరేషన్ పై పూర్తి సమాచారం తెలియజేస్తున్న ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. హైదరాబాదులో యాంటీ డెకొయిట్ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి నుంచి నగరవ్యాప్తంగా పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారని, చిలకలగూడలో డెకాయ్ ఆపరేషన్ చేస్తుండగా పోలీసులపై అనుమానితులు తిరుగబడ్డారని పేర్కొన్నారు. దీంతో.. పోలీసులపై తిరగబడ్డ అనుమానితులను కంట్రోల్ చేసేందుకు గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. చిలకలగూడ ప్రాంతంలో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.
Also Read
ఇదే కాకుండా.. ఆసిఫ్ నగర్‌లో కూడా గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. నేర నియంత్రణ చేయడానికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్లు చేపట్టిందని డీసీపీ గిరిధర్ తెలిపారు. ఇప్పటి వరకు డెకాయ్ ఆపరేషన్లు చేసి ఎనిమిది గ్యాంగ్ లను అరెస్ట్ చేశామని, సికింద్రాబాద్ మెట్టుగూడాలో పోలీస్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. అక్కడ సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న నలుగురు ముఠాను అరెస్ట్ చేశామని, వారి గత నేర చరిత్ర పై విచారణ చేస్తున్నామని డీసీపీ గిరిధర్ వెల్లడించారు. మెట్టుగూడా లో జరిగిన డెకాయ్ ఆపరేషన్లో పోలీసులపై దాడికి చేయడానికి ప్రయత్నం చేశారని, వారిని అదుపు చేయడానికి మా సిబ్బంది గాల్లోకి రివాల్వర్ ఫైర్ చేశారన్నారు. కొంత మంది యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!