జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్.యు.వి సిరీస్‌లోని పలు కార్ల మోడళ్ళలో బ్రేక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఈ మోడళ్ళను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా వివిధ మోడళ్ళకు చెందిన పది లక్షల కార్లు వెనక్కి తీసుకోనుంది. 2004 నుంచి 2015 వరకు తయారైన ఎస్‌యూవీ సిరీస్‌లోని ఎంఎల్, జీఎల్, ఆర్-క్లాస్ లగ్జరీ మినివ్యాన్ మోడళ్లలో బ్రేక్ పెడల్ తుప్పు పట్టిపోయాయని, దీంతో…