కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డిలు స్వాగతం పలికారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ధ్వజారోహణానికి ముందుగా నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సేనాధిపతి విష్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది, మాడ వీధుల్లో వారి ఊరేగింపు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది, ఇది బ్రహ్మోత్సవాలను ప్రారంభించనుంది. రాత్రి…