Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్‌యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.