నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటుడితో పాటు మిగతా నటీనటులు కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సమాచారం ప్రకారం స్టంట్ కొరియోగ్రాఫర్ శివ ఒక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇది…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మలినేని గోపీచంద్ తో బాలకృష్ణ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా వార్త వచ్చింది.…
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వరుస విజయాలను పొందిన ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు ఫ్యాన్స్ కూ కూడా ఆనందంగానే ఉంటుంది. పైగా ఒక ప్రాజెక్ట్ ను మించి మరో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతుంటాయి. అలా బాలకృష్ణ – బోయపాటి శీనుది సూపర్ హిట్ కాంబినేషన్. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీస్ చేసిన బోయపాటి ఇప్పుడు ‘అఖండ’ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు.…