ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. సెట్స్ పై ఉన్నబడా సినిమాల్లో.. శ్రీలీల లేని సినిమా లేదనే చెప్పాలి. అమ్మడి అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయింది శ్రీలీల. అలాంటి ఈ బ్యూటీకి తోడుగా ఎనర్జిటిక్ హీరో రామ్ తోడైతే.. విజిల్స్‌తో థియేటర్ టాపులు లేచిపోవాల్సిందే. రామ్, బోయపాటి అప్ కమింగ్ మూవీతో ఇదే జరగబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో..…
వచ్చీ రాగానే 'ఎనర్జిటిక్ స్టార్' అనిపించుకున్నారు; ఆ పై 'ఉస్తాద్' అనీ రెచ్చిపోయారు- ఏది చేసినా తనదైన బాణీ పలికిస్తూ అటు మాస్ నూ, ఇటు క్లాస్ నూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు 'రాపో' - అంటే రామ్ పోతినేని! పూరి జగన్నాథ్ నిర్దేశకత్వంలో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' ఘనవిజయం తరువాత హీరో స్టార్ భలేగా మారిపోయింది.