పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.