Tollywood Christmas: డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర జరిగినట్టు అయింది. ఒకేరోజు పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద కొంత సందడి నెలకొంది. ఈ రేసులో రోషన్ మేకా నటించిన ‘ఛాంపియన్’, ఆది సాయికుమార్ ‘శంభాల’, హారర్ థ్రిల్లర్ ఈషా సహా శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ వంటి చిత్రాలు పోటీ పడ్డాయి. వీటికి తోడు ప్రీతి పగడాల నటించిన ‘పతంగ్’, మలయాళ స్టార్ మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’ కూడా బరిలో నిలిచాయి. విమర్శకుల నుంచి మంచి మార్కులు సాధించడమే కాకుండా, కమర్షియల్‌గా కూడా ‘ఛాంపియన్’ అదరగొడుతోంది. రోషన్ మేకా నటన, కథా బలం తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లను రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.91 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
Read Also: Vijay Hazare Trophy 2025-26: విజయ్ హజారే ట్రోఫీ.. రో-కోల మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?
మిగిలిన సినిమాలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించాయి. ఆది సాయికుమార్ నటించిన శంభాల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో 5.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి గట్టి పోటీనిస్తోంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి సమర్పణలో వచ్చిన ఈషా సినిమాకు కూడా మంచి స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లో 3.61 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రీతి పగడాల నటించిన పతంగ్ చిత్రం యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మొత్తంగా చూస్తే, ఈ క్రిస్మస్ రేసులో ‘ఛాంపియన్’, ‘శంభాల’, మరియు ‘పతంగ్’ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే, మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకుంటూ రోషన్ మేకా ‘ఛాంపియన్’ రేసులో దూసుకుపోతోంది. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ చిత్రాల వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.