ఇటీవల విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా చెప్పేంత వరకు జీవీఎల్ కు తెలియదా అంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందా నిజంగా జరిగితే ఎందుకు అడగలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
Good News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. దీంతో ఉపాధ్యాయులంతా సంబరపడుతున్నారు.
రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా.. అంటూ చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. మేం కాన్ఫిడెంట్ గా ఉన్నాం...తుది తీర్పు కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుందని.. చంద్రబాబు ఎవరిని కలిసి రమ్మంటున్నాడో చూద్దాం అని ఆయన అన్నారు.
మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.