Bangladesh: బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి, ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్‌లో ముస్లింలను కించపరుస్తుందని, అక్కడ హింస చెలరేగుతుందని చెప్పారు.
BSF Arrested: బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసాకాండ తర్వాత తిరుగుబాటు నేపథ్యంలో భారత్ లో ఆందోళనలు పెరిగాయి. వందలాది మంది బంగ్లాదేశ్ పౌరులు భారత సరిహద్దు దగ్గర గుమిగూడి చొరబాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం కూడా, 11 మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది సత్వరమే వారిని పట్టుకొని వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. Trai…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరోసారి పాకిస్తాన్ రేంజర్లు బరితెగించారు. సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై కాల్పలు జరిపారు. ఈ రోజు సాయంత్రం పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. మక్వాల్ లోని సరిహద్దు ఔట్‌పోస్టు వెంబడి బీఎస్ఎఫ్ సిబ్బంది, సరిహద్దు అవతలి వైపు నుంచి వస్తున్న కాల్పులను తిప్పికొట్టారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన కాల్పులు 20 నిమిషాలకు పైగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు. భారత్…
ఇకపై దేశంలోకి అక్రమ చోరబాట్లు లేకుండ భారత సరిహద్దు వద్ద తేనె టీగలు రక్షణగా ఉండబోతున్నాయి. ఈ మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సరిహద్దుల్లో తేనె టీగలను కాపలాగా ఉంచబోతుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున తేనె టీగల పెంపకాన్ని బీఎస్ఎప్ చేపట్టనుంది. అయితే ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చేపట్టారు. ఎందుకంటే ఈ సరిహద్దుల్లోనే అక్రమ చోరబాట్లు ఎక్కువ. చెల్లుబాటు అయ్యే…
Soldier Killed In Militant Attack Near Bangladesh Border: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి జరిగింది. త్రిపురలోని భారత్- బంగ్లా సరిహద్దులో ఈ మిలిటెంట్లకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. ఉత్తర త్రిపురలోని కంచన్ పూర్ సబ్ డివిజన్ పరిధిలోని అనందబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం త్రిపుర-మిజోరాం- బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ సమీపంలో…