South India Cinema-BookMyShow Report: సౌతిండియా సినిమా లెవల్ ఇప్పుడు పాన్ఇండియా రేంజ్‌ని దాటేసి ప్రపంచ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్, బాలీవుడ్‌లను ఓవర్‌టేక్ చేసేసింది. ఈ మేరకు బుక్‌మైషో రిపోర్ట్ పలు ఉదాహరణలను వెల్లడించింది. ఇందులో ముందుగా కేజీఎఫ్ మూవీ గురించి చెప్పుకోవాలి. యశ్ హీరోగా రూపొందించిన ఈ చలన చిత్రం సంచలనం సృష్టించింది. కేజీఎఫ్ చాప్టర్-2 ప్రపంచవ్యాప్తంగా 12 వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.