Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన పార్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఢిల్లీ పెద్దల నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. దీనితో ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరుపై సస్పెన్స్ మరింత పెరిగింది. ప్రస్తుతం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్…
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్‌గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారిపోగా, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురి పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది.