తెలంగాణలో ఈ నెలలోనే బక్రీద్, బోనాలు పండుగలు జరుగనున్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని డి.జి.పి ఎం. మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. త్వరలో జరుగనున్న బక్రీద్, బోనాల పండుగల నిర్వహణపై డిజిపి కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, పశు సంవర్ధక శాఖ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రలు నేడు…