Lal Darwaza Bonalu 2025 Rangam and Gavu Patta Today: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు ఆదివారం బోనాలను సమర్పించారు. నిన్న ఘనంగా బోనాల సమర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం జరిగాయి. నేడు సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం తరువాత పచ్చి కుండపై రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పోతరాజుల గావు పట్టే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో పాటు ఘటాలు, పలహర బండ్ల ఊరేగింపు…
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన చోటు చేసుకుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాన్వాయ్‌పై సుమారు 30 మంది యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది. సమాచారం ప్రకారం, మాణికేశ్వర్ నగర్‌లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ను యువకులు అడ్డగించారు. వారు కాన్వాయ్‌లో ఉన్న గన్‌మెన్‌ల వెపన్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా, ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులోనుంచి…
Bandi Sanjay : ‘పన్నులు కట్టేది మనం. బిల్లులు కట్టేది మనం…సర్కారుకు ఖజానా చేకూర్చేది మనం. మరి మన ఆలయాల కోసం, బోనాల కోసం పైసలియ్యాలంటూ ప్రతి ఏటా బిచ్చమెత్తుకునే దుస్థితి మనకెందుకు?’’అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరినీ యాచించే అవసరమే లేకుండా బోనాల ఉత్సవాలతోపాటు హిందువుల పండుగలన్నింటికీ నిధులు కేటాయించి ప్రతి ఒక్క హిందువు గర్వించేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. టెర్రరిస్టుల బాంబు…
MLC Vijayashanti offering bonam to Borabanda goddess: హైదరాబాద్ నగరంలోని బోరబండలో ఆషాఢ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హాజరై.. అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తెలంగాణను దోచుకోవడానికి మరలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదని హెచ్చరించారు. Also Read: Ponnam Prabhakar:…
Aashadam Bonalu 2025 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నేడు (గురువారం) నుండి ఘనంగా ప్రారంభంకానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనం తో ఈ ఉత్సవాలకు తెరలేచింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని బోనాలకు అధికారికంగా ప్రారంభం పలుకనున్నారు. Virgin Boys:…
Ponnam Prabhakar : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. జూలై 26నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్ని శాఖల…