Hoax Bomb Threat: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. గత నెల కాలంగా దేశంలోని పలు ఎయిర్ లైన్ సంస్థలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. Read Also: Ranji Trophy: మెగా వేలానికి ముందు వీర బాదుడు.. ట్రిపుల్ సెంచరీ సాధించిన లోమ్రోర్ 187…
Shamshabad: కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మూడు ఇండిగో విమానాలు,
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
విశాఖకు వెళ్లిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాగా.. అప్పటికే విమానం విశాఖకు బయలుదేరింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో విమానం విశాఖలో ల్యాండింగ్ అయిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత సమాచారం లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే,…
ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్.. ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులో ఇరాన్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో తేలికపాటి వార్‌హెడ్‌లను ఉపయోగించాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికన్ నిపుణులు విశ్లేషించారు. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్‌కి చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని…
విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
టెంపుల్ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు..
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదరాబాద్ నుండి చండీగర్ వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అప్రమత్తమైంది.
టెంపుల్ సిటీ తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం ఈమెయిల్లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.