Orry Charged Rs 2o Lakh for One Touch: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లను పట్టుకుని.. ఫొటోలకు పోజులిస్తున్నాడు. ఆ వ్యక్తితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అతడే ‘ఓరీ’ అలియాస్ ‘ఓర్హాన్ అవత్రమణి అకా’. ఇన్స్టాగ్రామ్లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు నెట్టింట లైకుల, కామెంట్ల…
తన తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో చిరుత హీరోయిన్ నేహా శర్మ దూసుకుపోతున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో తన తండ్రితో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్.. తాజాగా ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలలో భాగంగా చెన్నై నగరంలో మంగళవారం నాడు జరిగిన వివాహ విందులో భాగంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేవలం దక్షిణాది సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. బాలీవుడ్ కు చెందిన అగ్రతారలు కూడా ఈ కార్యక్రమంలో…
2022 ఫిబ్రవరి 6న మరణించిన లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఆవిడ కుటుంబ సభ్యులు అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023 నుండి లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డులను వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 2023లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు కూడా దీననాధ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ…
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
సాయి పల్లవి.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సినీ పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అంటే ఒక్క సాయి పల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈవిడ హీరోయిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రను ఎన్నుకొని సూపర్ హిట్స్ కొట్టేస్తుంది. ఇకపోతే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్న రామాయణ సినిమాలో నటిస్తుందని తెలిసిన విషయమే. కాకపోతే సాయి పల్లవి ఆ సినిమాలో నటించేందుకు కళ్ళు చెదిరే పారితోషకం తీసుకుంటుందన్న విషయం…
చాలా కాలం తర్వాత, నితేష్ తివారీ రామాయణం షూటింగ్ మొదలైంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నిర్మాణాన్ని ప్రారంభించిన చిత్రం సెట్ కు సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అద్భుతమైన సెట్ లాగా కనిపించే ఫోటో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 3న ఈ సినిమా షూటింగ్ సెస్ పైకి వెళ్లింది. ఇకపోతే సోషల్ మీడియాలో చిత్రాన్ని షేర్ చేసిన వ్యక్తి దానికి ‘రామాయణం డే 1 ‘ అని క్యాప్షన్…
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు…
Mithun Chakraborty was admitted in hospital in Kolkata: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు…