పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో రిలీజ్ సూపర్ హిట్ టాక్ వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లోను వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కల్కి. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఓ హీరోయిన్ తన మూవీతో షాక్ ఇవ్వటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్‌తో సాహూ సినిమాలో కలిసి నటించిన శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో ‘స్త్రీ2’ అనే సినిమా రానుంది.
Also Read : Venu Yeldandi: బలగం దర్శకుడి కథలో బలం లేదా.?
ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు అందరిని ఆశ్ఛర్యపరుస్తున్నాయి. శ్రద్దా నటించిన స్త్రీ2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ కల్కి, ఫైటర్ సినిమాలను దాటేసి దూసుకువెళుతు బాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఫైటర్, కల్కి చిత్రాలను దాటేసి స్త్రీ2 ఏకంగా రూ.20 కోట్లు మేరకు కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. హిట్ టాక్ వస్తే లాంగ్ వీకండ్ కారణంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డ్స్‌ను ఈ సినిమా క్రియేట్ చేయటం పక్కా అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆగస్ట్ 15న స్టార్ హీరోలు నటించిన రెండు సినిమాలు విడుదలవుతున్నప్పటికీ శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ 2 అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.
Also Read: Shankar : శంకర్ దెబ్బకు సినిమాలు తీయడం ఆపేసిన నిర్మాత.. ఎవరంటే..?
2018లో విడుదలైన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా ఇన్నాళ్ళకు స్త్రీ 2ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా తమన్నా ఐటెమ్ సాంగ్ నెట్టింటి హల్ చల్ చేసింది.స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టి ఒక హీరోయన్ నటించిన సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అభినందదించదగ్గ విషయమే.