AR Rahman Controversy: ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు కారణమయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయని, దానికి కారణం కేవలం పని విషయంలో మార్పులే కాదు, నిర్ణయాలు తీసుకునే వాళ్ల ఆలోచనలు మారిపోవడమని చెప్పారు. ఈ మాటల్లో “కమ్యూనల్” అనే కోణం ఉండొచ్చని అనడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్‌ను ఒక ప్రశ్న అడిగారు. "బాలీవుడ్‌లో తమిళ వర్గం పట్ల వివక్ష ఉందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు..…