టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకు బిగ్గెస్ట్ ప్లాపులు ఇచ్చిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి జోరు మాములుగా లేదు.. కుర్ర హీరోలతో సమానంగా కాదు కుర్ర హీరోల కంటే ముందే మెగాస్టార్ జోరుమీద ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ ని పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది.. ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ని పట్టాలెక్కించారు.. ఈ షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీ…
బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా…
17 ఏళ్ళ కెరీర్… 7 సినిమాలు. వాటిలో రెండు కన్నడ చిత్రాలు. తెలుగులో ఐదు సినిమాలు. కన్నడలో రెండు సినిమాలు బాగా ఆడినవే. అయితే తెలుగులో తీసిన ఐదు సినిమాలూ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈ ఉపోద్ఘాతం అంతా దర్శకుడు మెహర్ రమేశ్ గురించే. దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెహర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. ఈ సారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయింది.…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమిళ…