మెగాస్టార్ చిరంజీవి జోరు మాములుగా లేదు.. కుర్ర హీరోలతో సమానంగా కాదు కుర్ర హీరోల కంటే ముందే మెగాస్టార్ జోరుమీద ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ ని పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది.. ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ని పట్టాలెక్కించారు.. ఈ షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీ తో 154 వ సినిమా సెట్లో అడుగుపెట్టారు. ఇక ఈ రెండు కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ ని పట్టాలెక్కించారు.
ఒకప్పుడు చిరు ఒకే ఏడాది నాలుగు అంతకంటే చిత్రాలు కూడా చేసారు. అయితే ఇప్పుడు ఒక్క నెలలోనే నాలుగు సినిమాల షూటింగ్స్ చేస్తూ.. ఒకే నెలలో అత్యధిక చిత్రాలు చేసిన స్టార్ హీరోగా చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ డిసెంబర్ లోనే ఈ నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే ఇతర కార్యక్రమాలకు కూడా చిరు అటెండ్ అవ్వడం ఆయన స్టామినాను తెలియజేస్తోంది. ఇక ఇవే కాకుండా పలు దర్శకులు చిరుకు కథలు చెప్పడానికి సిద్దమవుతున్నారట. ఆయన కూడా యంగ్ డైరెక్టర్లతో చేయడానికి తానెప్పుడు సిద్దమే అని అనడంతో వారు ముందువరసలో ఉన్నారట.. మరి చిరు ఇలా వరుస సినిమాలతో బిజీ కావడం మెగా ఫ్యాన్స్ కి పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఏదిఏమైనా మెగాస్టారా .. మజాకానా అని మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.