Sunita Williams: సునీతా విలియమ్స్‌ని భూమి మీద తీసుకువచ్చేందుకు రెస్క్యూ మిషన్ ప్రారంభం..
- సునీతా విలియమ్స్‌ని భూమి పైకి తీసుకువచ్చేందుకు రెస్క్యూ మిషన్..
- జూన్ నుంచి అంతరిక్షంలోని ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్..
- స్పేస్ ఎక్స్ క్రూ-9 క్యాప్సూల్ ద్వారా భూమి మీదకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Williams: నాసా శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ని అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ మిషన్‌ని నాసా ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 28 నుంచే ఈ మిషన్ ప్రారంభమైంది. జూన్ నెలలో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో వీరిద్దరు అంతరిక్షంలోని ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’ వద్దకు వెళ్లారు. అయితే, స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీలు, థ్రస్టర్లలో వైఫల్యం వంటి కారణాలతో దాంట్లో తిరిగి భూమి పైకి రావడం ప్రమాదమని భావించిన శాస్త్రవేత్తలు, వారు లేకుండానే స్టార్ లైనర్ భూమి మీదకు తీసుకువచ్చారు.
Read Also: HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
వీరిని స్పేస్ ఎక్స్‌కి చెందిన వ్యోమనౌక క్రూ-9 ద్వారా భూమి మీదకు తీసుకురాబోతున్నారు. క్రూ-9 మిషన్ కోసం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వ్యోమనౌక వెళ్లేందుకు సిద్ధమైంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే, సిబ్బంది సెప్టెంబర్ 29 సాయంత్రం 5.30 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. ఈ క్రూ-9లో నాసా కమాండర్ నిక్ హేగ్, రష్యా రోస్కోస్మోస్ నుంచి అలెగ్జాండర్ గుర్బునోవ్ ఉన్నారు.
స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా నలుగురు వ్యోమగాములు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. జూన్ 6 నుంచి ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ ఇందులో తిరిగి రావడానికి రెండు సీట్లు ఖాళీగా ఉంటాయి. ప్రస్తుతం వీరిద్దరు ఐఎస్ఎస్‌లో పార్క్ చేయబడిన క్రూ-8లో ఉన్నారు. క్రూ-9 వచ్చిన తర్వాత వీరిద్దరు ఇందులోకి వెళ్తారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!