PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్‌లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.