సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. ఏలూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్ర పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.. పోటీలకు విచ్చేసిన బాడీ బిల్డర్స్ గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కావడంతో, ఏలూరు ప్రభుత్వ వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు..
తెలంగాణలోని ఖమ్మంలో గత రెండు రోజులుగా ‘మిస్టర్ ఇండియా’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్ర ఇంకమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్‌కు చెందిన సాగర్ కతుర్డె ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన ఆర్.కార్తికేశ్వర్, శర్వణన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టీమ్ ఛాంపియన్ షిప్‌లో ఇండియన్ రైల్వేకు ప్రథమ స్థానం లభించగా తమిళనాడు జట్టుకు ద్వితీయ స్థానం లభించింది. విన్నర్‌గా నిలిచిన ఇండియన్ రైల్వేస్ టీమ్ 225 పాయింట్లు సాధించగా… రన్నరప్‌గా నిలిచిన తమిళనాడు…