Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్‌లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.