ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రసిద్ధ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో పడవ బోల్తా పడటంతో 65 మంది గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. జావాకు చెందిన ఏజెన్సీ ఫెర్రీ మానిఫెస్ట్ డేటా ప్రకారం పడవలో మొత్తం 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా నుంచి ప్రసిద్ధ గమ్యస్థానానికి వెళుతుండగా బుధవారం…