పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్‌బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.