నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
మాజీ మోడల్ దివ్య పహుజా హత్యకు గురైన గురుగ్రామ్ హోటల్ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు పంజాబ్‌లోని పాటియాలాలో దొరికింది. కారు లాక్ చేయబడి ఉంది. కారులో దివ్య మృతదేహం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అదుపు తప్పిందో బీఎండబ్ల్యూ కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది కారు. బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ముప్పు తప్పింది. గాయపడ్డ వ్యక్తిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో నుంచి వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది బిఎండబ్ల్యు కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టిందా కారు. అతివేగం వల్ల రోడ్డు మధ్యలో…
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 202 పిల్లర్ వద్ద నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడ్డ స్థానికులు దూరంగా పరుగెత్తారు. కారు ఇంజిన్ భాగంలో పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ పక్కకు నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు త్వరగా దిగేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే వున్నా పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సహాయంతో మంటలను…