Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ,
వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని సూచనలు చేశారు.
Maharashtra Politics: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రేలకు సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడిన వారసత్వం ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బాలాసాహెబ్ థాకరే జయంతిని పురస్కరించుకుని శివసేన (యుబిటి), విబిఎ కూటమి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త…