ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టెక్నాలజీల్లో బ్లాక్ చెయిన్, మెటావర్స్ టెక్నాలజీలు పటిష్టమైనవి. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేస్తు హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ ఇండస్ట్రీ ఓ గేమ్‌ను క్రియోట్ చేసింది. ఈ గేమ్ లో హైలెవల్ కు వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను గెలుచుకోవచ్చని, ఈ టోకెన్లను క్రిప్టో ఎక్చేంజ్ ద్వారా సొమ్ము చేసుకోవచ్చని గేమ్ తయారీదారులు చెబుతున్నారు. హైదరాబాద్ స్టార్టప్ సంస్థ క్లింగ్ ట్రేడింగ్ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. ప్రస్తుతం బీటా వెర్షన్…
సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత పెళ్లిళ్లు కూడా టెక్నాలజీకి అనుకూలంగా జరుగుతున్నాయి. కరోనా సమయంలో చాలా వరకు పెళ్లిళ్లు ఆన్‌లైన్ ద్వారా జరిగాయి. స్కూళ్లు, కాలేజీల క్లాసులు చాలా వరకు ఆన్లైన్ ద్వారానే జరిగాయి. అంతా డిజిటలైజేషన్ అయ్యాక ఇప్పుడు కరెన్సీ కూడా ఇప్పుడు డిజిటల్ రూపంలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రిఫ్టోకరెన్సీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో క్రిఫ్టోకరెన్సీ నడుస్తున్నది. కాగా, ఇప్పుడు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకొని వివాహాలు…