వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది.
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిన్న మీడియాతో మాట్లాడిన ఆర్‌కేరోజా తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. "వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు.