తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిన్న మీడియాతో మాట్లాడిన ఆర్‌కేరోజా తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. “వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు. కానీ.. కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం కారణంగా 6 మంది ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటనకు టీటీడీ ఛైర్మన్, ఈవోతో పాటు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణం. ప్రజల్లో అగ్రహాం రావడంతో సమాజ మెప్పు కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అంగీకరించారు.” అని ఆమె పేర్కొన్నారు.
READ MORE: Giorgia Meloni: విదేశీ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం.. ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
“విధినిర్వహణలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి పూర్తిగా విఫలం అయ్యారని పవన్ మాటల్లోనే స్పష్టమైంది. మరి కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలకండలి వైఫల్యమే కదా తొక్కిసలాటకి కారణం. వీరిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? కేవలం ప్రజల మెప్పు పొందడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం.! ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్థమవుతోంది. మీ వ్యూహం ఏమిటో!!” అని ఆర్‌కే రోజా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: L&T Chairman: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. దీపికా పదుకొణె షాకింగ్ రియాక్షన్