ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత రేఖ గుప్తా శనివారం మోడీని కలిశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ను కూడా ముఖ్యమంత్రి కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.
Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు.
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వే పకడ్బందీగా…
Ponnam Prabhakar : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను…
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయింది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది..…