దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు.
నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి.. విపక్షాల విమర్శలపై స్పందించారు.. నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? అని నిలదీసిన ఆయన.. మతం…
ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు భారతీయ జానతా పార్టీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా… మొదట శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్న ఆయన.. ఎయిర్పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్కు దాదాపు గంటకుపై గా ఉంటే.. మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు, ఎంపీ జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ సమావేశం కానున్నారు.. బీజేపీ ముఖ్యనేతలతో కూడా సమావేశం కానున్న జేపీ నడ్డా.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించను్నారు.. ఇక, మధ్యాహ్నం…
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది..…
తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. నాగార్జున సాగర్ మినహా.. వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. క్రమంగా తమ గ్రాప్ పెరుగుతుంది అంటున్నారు. కాషాయం పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణను చుట్టేస్తున్నారు.. హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి.. ఆ తర్వాత భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ…
Nithiin: ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ రాజకీయాలవైపు చూస్తున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ నటులు సినిమాల తరువాత రాజకీయాల వైపు చూసేవారు కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజసంగ్రామ పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ పాదయాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు. అయితే.. రేపు మూడో దశ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్ పోలీస్…
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తనపై హనీట్రాప్ జరిగిందని చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, తమ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తోన్న క్రమంలో, హనీట్రాప్ వ్యవహారం దుమారం రేపుతోంది. తనను హనీట్రాప్ చేసేందుకు ఎవరో కుట్ర చేశారంటూ, వాట్సాప్ చాట్ కు…
ప్రధాన నరేంద్ర మోడీని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని ఆహ్వానించారు.. ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు… అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా అందచేసిన లేఖలో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రస్తావించారు.. వాటిపై ప్రధాని…