Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక కొన్నిరోజులుగా సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం విదితమే. హాలీవుడ్ సినిమా కోసం అమ్మడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొంటున్నదట. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సమంత రాజకీయాల్లోకి వస్తోందని సోషల్ మీడియాలోని నెటిజన్స్ కోడై కూస్తున్నారు. త్వరలోనే బీజేపీ పెద్దలు సమంతను కూడా కలిసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సామ్ ఎన్నో సార్లు తనకు మోడీ ప్రభత్వం అంటే ఇష్టమని, తాను మోడీ సపోర్టర్ నే అని బాహాటంగా మీడియా ముందే చెప్పుకొచ్చింది. గతంలో అన్న వ్యాఖ్యలే అయినా ఇప్పుడు సామ్ మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రముఖలతో బీజేపీ మంతనాలు జరుపుతున్న విషయం విదితమే. మొన్నటికి మొన్న అమిత్ షా, ఎన్టీఆర్ ను కలవడం, నిన్నటికి నిన్న జేపీ నడ్డా, నితిన్ కలవడం జరిగింది. ఎన్టీఆర్ విషయం పక్కన పెడితే.. బీజేపీ ప్రచారంలో నితిన్ పాల్గొనాల్సిందిగా బీజేపీ నేత అడిగినట్లు సమాచారం. ఇక ముందు ముందు మరికొంతమంది సినీ ప్రముఖులను బీజేపీ నేతలు కలవనున్నట్లు టాక్ నడుస్తోంది. అందులో సామ్ కూడా ఉంటుందని అంటున్నారు. మొదటి నుంచి ఆమె మోడీ సపోర్టర్. ఇక ఇప్పుడు వారే వచ్చి అడిగితే కాదంటుందా..? అని అంటున్నారు. ఇక సామ్ అభిమానులు మాత్రం ఎప్పుడో అన్న వ్యాఖ్యలను పట్టుకొని ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం పద్దతి కాదని, ప్రస్తుతం సామ్ దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఖచ్చితంగా సామ్, రాజకీయాల్లోకి రాదు అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమవుతుందో చూడాలి.