బీజేపీ 2024లో అద్భుతమైన విజయం సాధించేలా కార్యాచరణ ప్రారంభీంచిందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాబోయే ఎన్నికల నాటికి 400సీట్లు గెలిచి కేంద్రంలో మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ ప్రభుత్వం లేని కారణంగా రాష్ట్ర వెనుకబడింది…అభివృద్ధి కోసం ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం చాలా ఉంది…. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ఐదు వేలకు పైగా సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు జీవీఎల్ నరసింహారావు.
Read Also: Muppidi Venkateswararao : ఆ నియోజకవర్గం టీడీపీ పరిస్థితి ఏంటి..? మూడేళ్లుగా గందరగోళం..!
పార్టీని విస్తరించే కార్యాచరణలో భాగంగా గతంలో గెలవని 144 స్థానాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టాం అని వివరించారు. ఆ జాబితాలో విశాఖ ఉంది. అందుకే ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించాం…తెలుగు రాష్ట్రాల పై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో భవిష్యత్ బీజేపీదే.. రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉందన్నారు జీవీఎల్. టీడీపీ మీద కూడా జనంలో సానుకూలత లేదు. వైసీపీ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ,జనసేన కూటమి మాత్రమే. జనసేనతో పొత్తు కొత్తగా పెట్టుకునేది కాదు మేం ఎప్పటి నుంచో భాగస్వామ్యులుగా ఉన్నామని స్పష్టం చేశారు జీవీఎల్.
Read Also: Ponguleti Srinivasa Reddy : రాజకీయ భవిష్యత్తుపై ఆ మాజీ ఎంపీ ఆచితూచి అడుగులేస్తున్నారా..?