Akhilesh Yadav: ఇండీ కూటమిపై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప ఇండి కూటమి సంకీర్ణం కొనసాగుతుంది ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. వక్ఫ్ బిల్లు ద్వారా మాఫియా లాగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.…
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండడంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని…
మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది…
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
TPCC Mahesh Goud : కేటీఆర్కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని, పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని ఆయన మండిపడ్డారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది శుద్ధి చేస్తామంటారు.. కానీ తెలంగాణలో మూసి పునరుజ్జీవం…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ఎవరూ ఓటుకు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్ హరివెంకట కూమారిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు.