ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం సజీవంగా ఉందని, పాకిస్థాన్‌తో చర్చలు జరపడం ద్వారానే దాన్ని అంతం చేయగలమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
PM Modi To Distribute 71,000 Job Letters To New Recruits On Jan 20: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ జాబ్ లెటర్స్ అందిచనున్నారు. జనవరి 20న దాదాపుగా 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందిచబోతున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకారం.. ప్రధాని మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వాారా ఉదయం 10.30 గంటలకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తారని, కొత్తగా జాబులో చేరబోతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.
PM Narendra Modi: మా ప్రాధాన్యత అభివృద్ది, ఓటు బ్యాంకు రాజకీయాలు కావని ప్రధాని నరేంద్రమోదీ గురువారం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు, రాజకీయా పార్టీలు రోడ్డు, విద్యుత్, నీటి సదుపాయాల కోసం పనిచేయకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవని విమర్శించారు. గురువారం, ప్రధాని మోదీ కర్ణాటకలోని కోడెకల్ జిల్లాలో సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి అనేక…
బండి సంజయ్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఖమ్మం సభను చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
47 ఏళ్ల వయస్సు గల వ్యక్తి 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయంతో కావడంతో ఆమెతో కలిసి లేచిపోయాడు. దీనిలో ఏముంది అనుకుంటున్నారా.. అయితే అతను బీజేపీ సీనియర్ నేత కావడం, ఆమె ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత కూతురు కావడమే.
కేసీఆర్ ఏమైనా దేశ నాయకుడా ఆయన పుట్టినరోజు నాడు సెకటేరియట్ ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ జయంతి నాడు సెకటేరియట్ ను ఎందుకు ప్రారంభించరు? కేసీఆర్ ఉన్న ఇబ్బంది ఏంటి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.