కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర శిబిరం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలవేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లాలో పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు.
అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
CM Bhupesh Baghel: బీరాన్ పూర్ ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. బీజేపీ సీనియర్ నేతల కుమర్తెలు ముస్లింలను ప్రేమిస్తే దాన్ని ప్రేమ అంటున్నారని, వేరేవారు ప్రేమిస్తే ‘‘లవ్ జీహాద్’’ అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ లో అత్యంత సీనియర్ బీజేపీ నాయకుడు కుమార్తె ఎక్కడ ఉందో అడగండి..దాన్ని లవ్ జిహాద్ అనడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. బీజేపీ నేతల కుమార్తెలు చేస్తే ప్రేమ, వేరే వారు…
Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ పై రాజకీయ దుమారం రేగుతోంది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఫిబ్రవరిలో హత్య చేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్, అతని కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు.