ఎంఎన్ జే కాన్సర్ ఆసుపత్రి నూతన బ్లాక్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రస్తుతం ఓల్డ్ బ్లాక్ 450 బెడ్స్ ఉండగా, ఈ నూతన బ్లాక్ తో మరో 300 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు.
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు చాలా మంది అరెస్ట్ అయ్యారు.
ఇటీవలే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్లో ఎదురుదెబ్బ తగిలింది. 2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
హనుమకొండ జిల్లాలో ఉద్రిక్త వాతావణం నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వి నేతల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్వీ నేతలు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు.
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ ఎన్ కౌంటర్ పై ఉత్తర్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్రంలోని విపక్ష పార్టీలు యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ అంశంపై విపక్ష సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది.
ఢిల్లీలోని ద్వారకా జిల్లాలోని బిందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటియాలా రోడ్లో తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకుడు సురేంద్ర మతియాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.