సెప్టెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చేపట్టారు.
బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులపై పురందేశ్వరి కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో భారీగా జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 15 నుంచి 17 జిల్లాల్లో బీజేపీ అధ్యక్ష స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Rahul Gandhi: యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండియా-భారత్ వివాదంపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి భయంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు
TS Congress: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన పెద్ద నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Yogi Adityanath: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న…
Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్.. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Home guard Ravinder: కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
Sita Mandir Construction in Bihar: ప్రజల మనసు దోచకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రామ మందిరంతో హిందువులకు దగ్గరైన బీజేపీ తరహాలోనే సీతా మందిర్ కట్టి వారికి దగ్గరవ్వాలని జేడీయూ భావిస్తున్నట్లు ఉంది. దీని కోసం సీతా దేవి జన్మించినట్లు చెబుతున్న సీతామర్హి జిల్లాలోని పునారా ధామ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని కోసం మంత్రి వర్గ సమావేశంలో రూ.72.47 కోట్లకు ఆమోదం తెలిపారు. సీతామర్హి జిల్లా పునౌర…