AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Forecast Today: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ వాయుగుండం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లోని సత్ఖీరాకు సుమారు 80 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని బంకురాకు 160 కిలోమీటర్లు, ఒడిశాలోని బాలేశ్వర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేశారు.
వాయుగుండం ప్రభావంతో వాయువ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రం అలజడిగా మారి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షితంగా తీరానికి తిరిగి రావాలని సూచించింది. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో అధికారుల సూచనలు పాటించాలని కోరింది.
Also Read
వాయుగుండం ప్రభావంతో సోమవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖపట్నం, ఏలూరు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వాయుగుండం కదలిక, దాని ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!