Amit Shah: ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా అన్నారు. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని.. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తు్న్నామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మా మిత్రులను ఎప్పుడూ మేము బయటకు పంపలేదని ఆయన చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.
Read Also: Asaduddin Owaisi: దేశానికి మోడీ బాబా అవసరం లేదు.. పార్లమెంట్‌లో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల గురించి అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో టీడీపీ వచ్చి చేరుతుందా.. ఇతరులు ఎవరైనా వచ్చి చేరుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.