Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Ponnam Prabhakar : కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండే పార్టీ అని పేర్కొన్నారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి ఇస్తామని బీజేపీ ప్రకటించినా, శాసనసభ నాయకత్వం ఇవ్వలేకపోయిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి అకారణంగా తొలగించడం…
గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.
యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్లో సముద్రుడి సాక్షిగా... భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో... వీళ్ళెవరో మహానుభావులు..... అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది.
Minister Ponnam: ఢిల్లీలో అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.. భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ భగీదారీ బాయి సమ్మేళన్‌లో మాట్లాడుతూ..ప్రధాని మోడీకి చేసేదంతా ‘‘షో’’నే అని, ఆయకు సరైన విషయం లేదని అన్నారు. ఆయన ఒక పెద్ద ప్రదర్శన, ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీని రెండు మూడు సార్లు కలిసిన తర్వాత, ఆయనతో ఒకే గదిలో కూర్చున్న తర్వాత,…
Kota Srinivasa Rao Tribute Meeting in Vijayawada: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞశాలి అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశంసించారు. బీజేపీ సిద్ధాంతాలని చాటి చెప్పి.. పాటించిన వ్యక్తి అని పేర్కొన్నారు. కొన్ని సినిమాల్లో హిందుత్వాన్ని తప్పుగా చూపిస్తే ప్రతి ఘటించారనని చెప్పారు. తెలుగు వారిని, తెలుగు సినిమా కాపాడడానికి కోట ఎప్పుడూ ముందు ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పుకొచ్చారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావుకి హోటల్…
దేశ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు.
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Tejashwi Yadav: మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఇప్పటికే, పాలక బీజేపీ-జేడీయూ కూటమితో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రచారాన్ని మొదలుపెట్టాయి., మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ద్వారా ఫేక్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాను ఎన్డీయేకు అనుకూలంగా మార్చడానికి ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ…