Tamil Nadu CM: దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఈసారి బీజేపీకి ఓట్లు వేయరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అయితే దేశం ఇంకోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చి వేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎలాంటి లబ్ధి జరుగదు అని తెలిపారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుంది.. కేవలం నరేంద్ర మోడీ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.
Read Also: Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..!
Also Read
ఇక, బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల తర్వాత తెర మీదకు వస్తుందని చెప్పారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు.
Read Also: Cyber Fraud: అమాయకులపై సైబర్ పంజా.. ట్రేడింగ్ పేరుతో 16 లక్షలు టోకరా..
కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శ్రీలంకను చాలా సార్లు వెళ్లారు.. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మోడీ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 19వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరనుంది. ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు