ఒక దశాబ్ద కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా సాధించలేని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు.
తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో…
Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
అధికార పార్టీకి వత్తాసుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాజాగా మరోసారి శుక్రవారం ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.. 37 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి. ఆపై తిరిగి నిద్రపోండి.’’ అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు.
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్.అళగిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కంగనా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తే.. రైతులు చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ చొరబాటుదారులను కాపాడుతోందని తిప్పికొట్టారు. బీహార్‌లోని డెహ్రీలో షహాబాద్, మగధ్ ప్రాంతాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నాయకుడు కేఎస్.అళగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ... ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.