Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో నిన్న భారత వైమానిక దళం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా,…
భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఊహలు గ్యాస్ బుడగ లాగా ఉన్నాయని.. ఎంతో ఎత్తుకు ఎగిరి గ్యాస్ బుడగ చివరకు పేలిపోతుందని సీపీఎం జాతీయ నేత బృంధాకారత్ అన్నారు. శ్రీకాకులంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరిస్థితి గ్యాస్ బుడగ వలే ఉందన్నారు.
Prajwal Revanna: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు.
సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని.. ఎపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. "ఎపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా
మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.