JP Nadda: కర్ణాటక బీజేపీ వివాదాస్పద పోస్టు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ల అనే అంశంపై బీజేపీ ఓ యానిమేటేడ్ వీడియోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయిస్తున్నారని, వారికే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చూపించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మతాల మధ్య చిచ్చుపెట్టాలా ప్రయత్నిస్తోందని మండిపడింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ ఐటీ హెచ్ అమిత్ మాల్వియా, కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Also: Chhattisgarh HC: “వివాహం” ఇచ్చే భద్రత “లివ్-ఇన్ రిలేషన్” అందించదు..
ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై బెంగళూర్ పోలీసులు జేపీ నడ్డాతో పాటు అమిత్ మాల్వియాకు సమన్లు జారీ చేసింది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బుధవారం నేతలకు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జేపీ నడ్డా, అమిత్ మాల్వియాలకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ పోస్టును తొలగించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్‌ని కోరింది. కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా ఈ పోస్టును తొలగించాలని బీజేపీని కోరారు. కర్ణాటకలో నిన్నటితో అన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ముగిసిన ఒక రోజు తర్వాత ఈ నోటీసులు వచ్చాయి.